కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స పొందుతున్న వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఛాతీనొప్పి కారణంగా గంగూలీ ఆసుపత్రిలో చేరారని అందులో తెలిపింది. ఇంట్లోని జిమ్‌లో ట్రెడ్ మిల్ చేస్తుండగా.. ఛాతీలో నొప్పి వచ్చినట్లు చెప్పింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దాదా ఆసుపత్రికి వచ్చాడని, ఆ సమయంలో అతని పల్స్ రేటు నిమిషానికి 70, బీపీ 130/80గా ఉన్నదని వెల్లడించింది. ఆయనకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ నిర్వహిస్తున్నట్లు వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ చెప్పింది. ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ప్రస్తుతం గంగూలీ ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాడని, ఆయనకు రెండు స్టెంట్లు వేయాల్సి రావచ్చని వార్తలు వస్తున్నాయి. భారత మాజీ క్రికెట్ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆకాంక్షించారు. దాదా త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. గంగూలీ కోల్‌కతాలోని తన ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ‘గంగూలీకి గుండెపోటు వచ్చిందన్న వార్త తెలిసి చాలా బాధపడ్డాను. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న దాదా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలోగంగూలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు’ మమతా ట్వీట్ చేశారు.టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండెపోటు వచ్చింది. ఈ విషయం క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ట్రెండ్ అవుతోంది. గంగూలీకి అస్వస్థత అని తెలియడంతో చాలా మంది ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.అందులో సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా ఉన్నారు. ఒకప్పుడు ఈమెకు దాదాతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ఇద్దరి మధ్య ఎఫైర్ కూడా నడిచిందనే వార్తలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలి.. గెట్ వెల్ సూన్.. ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేసింది నగ్మా. గంగూలీ ప్రస్తుతం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయంత్రానికి గంగూలీకి ఆంజియోప్లాస్టీ చికిత్స చేయనున్నట్టు తెలుస్తున్నది. జిమ్ చేస్తుండగా గంగూలీకి గుండె పట్టినట్లు అనిపించడంతో వెంటనే ఆయన జిమ్ ఆపేసాడు.. ఆ తర్వాత హాస్పిటల్ కు వెళ్లాడు.
