పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కి శస్త్ర చికిత్స

అపెండిసైటిస్‌తో బాధపడుతున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌కు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. వారం రోజులపాటు విశ్రాంతి తీసుకున్నాక అతను మళ్లీ బరిలోకి దిగవచ్చని వైద్యులు సూచించారు. బయో బబుల్‌ నుంచి బయటకు వెళ్లడంతో ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం రాహుల్‌ మళ్లీ క్వారంటైన్‌ పూర్తి చేసుకొని పంజాబ్‌ కింగ్స్‌ జట్టుతో కలవాల్సి ఉంటుంది.