నంబ‌ర్ వ‌న్ టెస్ట్ చాంపియ‌న్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్‌లో సాధించిన చారిత్ర‌క విజ‌యంతో టీమిండియా మ‌రోసారి టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కూ తొలి స్థానంలో ఉన్న ఆసీస్ మూడోస్థానానికి దిగ‌జారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా 5 సిరీస్‌ల‌లో 13 టెస్టులు ఆడిన టీమిండియా.. 9 విజ‌యాలు సాధించి, మూడింట్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్ర‌స్తుతం టీమిండియా ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. 71.7 శాతం విజ‌యాలతో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. మ‌రోవైపు ఆస్ట్రేలియా 4 సిరీస్‌ల‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచి, నాలిగింట్లో ఓడింది. మ‌రో 2 డ్రాగా ముగిశాయి. ఆసీస్ ఖాతాలో 332 పాయింట్ల ఉండ‌గా.. 69.2 శాతం విజ‌యాల‌తో మూడోస్థానంలో ఉంది. 70.0 శాతం విజయాల‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో కొన‌సాగుతోంది.

ఇది కూడా చదవండి

భారత జట్టుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అభినంద‌న‌లు

 

గబ్బాలో ఆస్ట్రేలియాకు దెబ్బ