అంతర్జాతీయ(ఐసీసీ) క్రికెట్ మండలి చైర్మన్‌గా గ్రేగ్ బార్‌క్లే ఎన్నికయ్యారు. న్యూజిలాండ్ క్రికెట్‌కు హెడ్‌గా ఉన్న గ్రేగ్.. ఐసీసీ చైర్మన్ పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో కీలకమైన ఓట్లను ఆయన గెలుచుకున్నారు. ఈ ఏడాది జూలైలో ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శషాంక్ మనోహర్ తప్పుకోవడంతో.. తాత్కాలిక చైర్మన్‌గా ఇమ్రాన్ ఖ్వాజా చేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఖ్వాజాను గ్రేగ్ ఓడించారు. బార్‌క్లేకు పది ఓట్లు పోలయ్యాయి. ఖ్వాజా ఖాతాలో ఆరు ఓట్లు పడ్డాయి. అయితే రెండవ రౌండ్‌లో బార్‌క్లే కీలకమైన 11 ఓట్లు గెలుచుకున్నారు. ఐసీసీ బోర్డులో 16 మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచ పోటీలను ఐసీసీ నిర్వహించాలని లేదంటే క్రీడలకు కష్టకాలం ఉంటుందని బార్‌క్లే అభిప్రాయపడ్డారు.
న్యూజిలాండ్‌లో బార్‌క్లేకు మంచి పేరున్నది. ఉత్తమ పరిపాలకుడిగా ఆయన్ను గౌరవిస్తారు. న్యూజిలాండ్ క్రికెట్ వృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ద్వైపాక్షిక క్రికెట్ నిర్వహణ కీలకమైందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐసీసీ ఈవెంట్ల కన్నా ముందు ద్వైపాక్షిక సిరీస్‌లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కమర్షియల్ లాయర్ అయిన బార్‌క్లే.. న్యూజిలాండ్ క్రికెట్ డైరక్టర్‌గా 2012 నుంచి పనిచేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన 2015 వరల్డ్‌కప్‌కు డైరక్టర్‌గా కూడా చేశారు. పలు ఆసీస్, కివీస్ కంపెనీల్లో ఆయన బోర్డు డైరక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తనను ఐసీసీ చైర్మన్‌గా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మద్దతు ఇచ్చిన ఐసీసీ డైరక్టర్లకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. కరోనా మహమ్మారి నుంచి క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఐసీసీ తాత్కాలిక అధ్యక్షుడిగా చేసిన ఇమ్రాన్ ఖ్వాజాకు బార్‌క్లే థ్యాంక్స్ తెలిపారు.