ఆసుపత్రిలో చేరిన గంగూలీ

కోల్‌క‌తా:  బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫ‌ర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీకి మ‌రోసారి ఛాతీలో నొప్పి వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను వెంట‌నే కోల్‌క‌తాలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మంగ‌ళ‌వారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మ‌రోసారి ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ మ‌ధ్యే దాదాకు గుండె పోటు రావ‌డంతో కోల్‌క‌తాలోని వుడ్‌ల్యాండ్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు యాంజియోప్లాస్టీ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఐదు రోజుల‌పాటు ఆసుప‌త్రిలోనే ఉన్న గంగూలీ.. త‌ర్వాత ఇంటికి వ‌చ్చారు.