ముంబై: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఫిబ్రవరిలో జరగబోయే మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలన్నీ వాళ్ల రిటెన్షన్ ప్లేయర్స్, వదిలేసిన ప్లేయర్స్ జాబితాను ప్రకటించాయి. కొన్ని టీమ్స్ పెద్ద పెద్ద ప్లేయర్స్‌ను వదిలేసి ఆశ్చర్యానికి గురి చేశాయి. రాజస్థాన్ రాయల్స్ స్టీవ్ స్మిత్‌ను వదిలేసింది. వచ్చే సీజన్‌లో ఆ టీమ్‌కు సంజు శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ మోరిస్‌లాంటి ప్లేయర్స్‌ను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా టీమ్స్‌లో ఎవరు ఉన్నారు? ఎవరు వెళ్లిపోయారన్నది ఇప్పుడు చూద్దాం.
ముంబై ఇండియన్స్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: రోహిత్ శర్మ, డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ఆదిత్య తారె, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చహర్, జయంత్ యాదవ్, ధవళ్ కులకర్ణి, మొహసిన్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్
రిలీజ్ చేసిన ప్లేయర్స్:లసిత్ మలింగ, మిచ్ మెక్‌క్లెనగన్, జేమ్స్ పాటిన్‌సన్, నేథన్ కూల్టర్- నైల్, రూథర్‌ఫర్డ్, ప్రిన్స్ బల్వంత రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్
ఢిల్లీ క్యాపిటల్స్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్:శ‌్రేయస్ అయ్యర్, అజింక్య రహానే, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, ఇషాంత్, రబాడా, పృథ్వీ షా, అశ్విన్, పంత్, ధావన్, లలిత్ యాదవ్, స్టాయినిస్, హెట్‌మెయర్, డేనియల్స్ సామ్స్, ఆన్‌రిచ్ నోక్యా.
రిలీజ్ చేసిన ప్లేయర్స్: అలెక్స్ కేరీ, కీమో పాల్, సందీప్ లామిచానె, తుషార్ దేశ్‌పాండె, మోహిత్ శర్మ
సన్‌రైజర్స్ హైదరాబాద్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: వార్నర్, అభిషేక్ శర్మ, బేసిల్ థంపి, భువనేశ్వర్‌కుమార్, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, శ్రీవత్స గోస్వామి, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, నటరాజన్, విజయ్ శంకర్, సాహా, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, ప్రియం గార్గ్, విరాట్ సింగ్
రిలీజ్ చేసిన ప్లేయర్స్:సంజయ్ యాదవ్, సందీప్, బిల్లీ స్టాన్‌లేక్, ఫాబియన్ అలెన్, యర్రా పృథ్విరాజ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: విరాట్ కోహ్లి, డివిలియర్స్, దేవ్‌దత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, చాహల్, జోషువా ఫిలిప్, పవన్ దేవ్‌పాండే, షాబాజ్ అహ్మద్, ఆడమ్ జంపా
రిలీజ్ చేసిన ప్లేయర్స్:క‌్రిస్ మోరిస్, ఆరోన్ ఫించ్, మోయిన్ అలి, ఇసురు ఉడానా, డేల్ స్టెయిన్, శివమ్ దూమే, ఉమేష్ యాదవ్, పవన్ నేగి, గుర్‌కీరత్ మాన్, పార్థివ్ పటేల్.
కింగ్స్ పంజాబ్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, మణ్‌దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, దీపక్ హుడా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, మహ్మద్ షమి, క్రిస్ జోర్డాన్, దర్శన్ నాల్‌కంటే, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, ఇషాన్ పోరెల్
రిలీజ్ చేసిన ప్లేయర్స్: గ‌్లెన్ మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, హార్డస్ విలియోన్, జగదీశ్ సుచిత్, ముజీబుర్ రెహమాన్, షెల్డన్ కాట్రెల్, జిమ్మీ నీషమ్, క్రిష్ణప్ప గౌతమ్, తజిందర్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: దినేష్ కార్తీక్, ఆండ్రీ రసెల్, కమలేష్ నగర్‌కోటి, కుల్‌దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, నితీష్ రానా, ప్రసిద్ధ్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, శివమ్ మావి, శుభ్‌మన్ గిల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, ప్యాట్ కమిన్స్, రాహుల్ త్రిపాఠీ, వరుణ్ చక్రవర్తి.
రిలీజ్ చేసిన ప్లేయర్స్: ఎం సిద్ధార్థ్, నిఖిల్ నాయక్, సిద్ధేష్ లాడ్, క్రిస్ గ్రీన్, టామ్ బాంటన్.
చెన్నై సూపర్ కింగ్స్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: ఎమ్మెస్ ధోనీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, డ్వేన్ బ్రేవో, జోష్ హేజిల్‌వుడ్, సామ్ కరన్, కేఎం ఆసిఫ్, దీపక్ చహర్, ఫాఫ్ డుప్లెస్సి, ఇమ్రాన్ తాహిర్, జగదీశన్, కరణ్ శర్మ, లుంగి ఎంగిడి, మిచెల్ సాంట్నర్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, సాయి కిశోర్.
రిలీజ్ చేసిన ప్లేయర్స్: పియూష్ చావ్లా, హర్భజన్‌సింగ్, కేదార్ జాదవ్, మురళీ విజయ్, మోను సింగ్, షేన్ వాట్సన్
రాజస్థాన్ రాయల్స్
రిటేన్ చేసుకున్న ప్లేయర్స్: సంజు శాంసన్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా, మహిపాల్ లోమ్రార్, కార్తీక్ త్యాగి, ఆండ్రూ టై, జయదేవ్ ఉనద్కట్, మయాంక్ మార్కండె, యశస్వి జైస్వాల్, అనుజ్ రావత్, డేవిడ్ మిల్లర్, మనన్ వోహ్రా, రాబిన్ ఉతప్ప
రిలీజ్ చేసిన ప్లేయర్స్:స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఒషానె థామస్, ఆకాశ్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ధ జోషి, శశాంక్ సింగ్.