రహనేపై దాదా ప్రశంసలు

ముంబై:  బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాకు అద్భుత విజ‌యం సాధించి పెట్టిన కెప్టెన్ అజింక్య ర‌హానేపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ విజ‌యం ప్ర‌త్యేక‌మైన‌ద‌ని అన్నాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడ‌టాన్ని టీమిండియా బాగా ఆస్వాదిస్తుంద‌ని, ర‌హానే అద్భుతంగా ఆడాడ‌ని దాదా ట్వీట్ చేశాడు. టీమ్‌కు త‌న శుభాకాంక్ష‌లు చెప్పాడు. త‌ర్వాత రెండు టెస్టులకూ బెస్టాఫ్ ల‌క్ తెలిపాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో 8 వికెట్ల‌తో గెలిచిన టీమిండియా నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో స‌మం చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసిన ర‌హానే ఈ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.