నగరంలో నైట్ కర్ఫ్యూ

నగరంలో గడిచిన 24 గంటల్లోనే అత్యధికంగా 9,086 కరోనా కేసులు వెలుగుచూడటం కలవరం రేపింది. రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,51,508కి పెరిగింది. దీంతో కరోనా కట్టడికి శనివారం నుంచి పూణే జిల్లాలో 12 గంటల పాటు నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పూణె జిల్లాలో వారంరోజుల పాటు బార్ లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని నిర్ణయించారు. పూణే నగరంలోనే ఒక్కరోజు 4,653 కరోనా కేసులు నమోదైనాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 58 మంది మరణించారు.