పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసలు మళ్లీ పెరిగాయి. నిన్నమొన్న 5 నుంచి 6వందలు వరకు నమోదైన కేసులు తాజాగా 9వందలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 952 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2.58 లక్షలకు చేరింది. 1,410 మంది మరణించారు.

ప్రస్తుతం తెలంగాణలో 13,732 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2.43లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే రోజూ అరవై వేల వరకు కరోన పరీక్షలు చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల నుంచి ఈ టెస్ట్ ల సంఖ్య బాగా తగ్గించారు. ఒక్క రోజే 38,245 పరీక్షలు చేయగా, ఇప్పటిదాకా 49,29,974 కరోనా పరీక్షలు చేశారు.