దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి . భారత్‌లో తాజాగా 29,398 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 97,96,770 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

కరోనా నుంచి కొత్తగా 37,528 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 92,90,834గా ఉంది. దేశంలో ప్రస్తుతం 3,63,749 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 414 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య 1,42,186గా ఉంది.