మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం సర్కారు వారి పాట. ఇవాళ దుబాయ్‌లో షూటింగ్ మొదలైంది. పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాశ్‌రాజ్, రావురమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొలిసారి పరశురాం-మహేశ్‌బాబు క్రేజీ కాంబో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఏ సినిమా అయినా హీరోకు తగ్గ విలన్ కూడా ఉండాలి.మహేశ్ సినిమా అంటే విలన్ కూడా కాస్త స్టైలిష్ గా కనిపించాలి. మరి ఇంతకీ ఈ ప్రాజెక్టులో విలన్ ఎవరై ఉంటారా…? అని టాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. తాజాగా విలన్ గా అరవింద్‌స్వామి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు. మరికొంతమంది యాక్టర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మనీ, బ్యాంకింగ్, ప్రతీకారం లాంటి అంశాల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎవరు నటిస్తారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.అరవింద్‌స్వామి ఇప్పటికే ధృవ చిత్రంలో విలన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. అరవింద్‌స్వామి ఇప్పటికే ధృవ చిత్రంలో విలన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. పరశురాం 2018లో డైరెక్ట్ చేసిన గీతగోవిందం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మహేశ్‌తో సినిమా చేస్తుండటంతో సర్కారువారి పాటపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
