అజిత్‌ను హెచ్చరించారట

తమిళ సినీ పరిశ్రమలో హీరో అజిత్‌ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ హీరోగా అభిమానులు అలరించే సినిమాలు చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారాయన. అయితే కెరీర్ తొలినాళ్లలో అజిత్ ఎన్నో ప్రేమకథా చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తెలుగులోకి డబ్ అయిన ‘ప్రేమలేఖ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమాల్లోలాగానే ఆయన నిజ జీవితంలోనూ ఓ ప్రేమకథ ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితు పెద్దల కారణంగా అది పెళ్లి వరకు వెళ్లలేకపోయింది.

ఆహ్వానం, లిటిల్ సోల్జర్స్, ఆవిడా మా ఆవిడే, రాణా, పెద్ద మనుషులు, అల్లుడుగారు వచ్చారు.. లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో.. తమిళంలో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది. అప్పట్లో అజిత్‌‌తో ఆమె రెండు మూడు సినిమాలు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్లో ప్రచారం జరిగింది. అజిత్ ఆమెకు ప్రేమలేఖలు కూడా రాసేవాడట.

అయితే ప్రేమ, పెళ్లి.. లాంటి బంధంలో పడితే తన కూతురు కెరీర్ నాశనమైపోతుందని భయపడిన హీరో తల్లి వీరి ప్రేమకు అంగీకరించలేదట. తన కూతురి వెంట పడటం మానుకోవాలని అజిత్‌ను హెచ్చరించారట. దీంతో ఆమెకు దూరమైన అజిత్ సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ తర్వాత షాలినితో ప్రేమ పడి ఆమెను పెళ్లాడారు. ప్రస్తుతం ఈ జంట ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది.