దున్నెటోడి వెన్ను విరిచి భూస్వాములు ధనికులైరి

రానా ద‌గ్గుబాటి-సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌స్తున్న సినిమా విరాట‌ప‌ర్వం. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజ‌ర్ రాను వ‌చ్చింది. విరాట‌ప‌ర్వం టీజ‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆదిప‌త్య జాడ‌ల‌నే చెరిపేయ‌గ ఎన్నినాళ్లు తార‌తమ్య గోడ‌ల‌నే పెకిలించ‌గా ఎన్నినాళ్లు అంటూ అర‌ణ్య  (‌రానా పేరు) విప్ల‌వ క‌విత్వాన్ని రాసే సన్నివేశంతో టీజ‌ర్ షురూ అయింది. అర‌ణ్య క‌విత్వాన్ని చ‌ద‌వి అత‌ని ప్రేమ‌లో ప‌డిన యువ‌తిగా సాయిప‌ల్ల‌వి కనిపిస్తుండ‌గా..ఆ త‌ర్వాత పోరాట స‌న్నివేశాల‌తో టీజ‌ర్ సాగుతుంది. ఓ వైపు ప్రేమ, మ‌రోవైపు పోరాటాన్ని సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎలా చూపిస్తాడ‌న్న‌ది సస్పెన్స్ గా ఉంది.

విరాట‌ప‌ర్వం వేస‌వి కానుకగా ఏప్రిల్ 30న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయయ‌నుంది. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్ట‌ర్. సాయిచంద్ , న‌వీన్ చంద్ర,‌ ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్ కీల‌క ‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సుధాక‌ర్ చెరుకూరితో క‌లిసి సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.