ఛార్మీకి దేవరకొండ స్పెషల్‌ గిఫ్ట్‌

15ఏళ్లకే నీ తోడు కావాలి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రి ఇచ్చిన ఛార్మీ తెలుగునాట స్టార్‌డంను సొంతం చేసుకుంది. అగ్రహీరోలతో నటిస్తూనే నటనా ప్రాధాన్యమున్న సినిమాలను చేసి సత్తా చాటింది. ప్రస్తుతం హీరోయిన్‌గా వెండితెరకు దూరమైనా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్‌ పేరుతో నిర్మాతగా మారింది. సోమవారం ఛార్మీ34వ బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సహా అభిమానులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఇక హీరో విజయ్‌ దేవరకొండ ఓ స్పెషల్‌ గిఫ్ట్‌తో ఛార్మీని సర్‌ప్రైజ్‌ చేశాడు.

దీంతో ఆనందంలో మునిగిపోయిన ఛార్మీ ఈ గిఫ్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ మురిసిపోయింది. దీంతో ఆ గిఫ్ట్‌ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్‌లో క్వశ్చన్స్‌ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇక విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ లైగర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఈ చిత్రంతో విజయ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక మొదటిసారి విజయ్‌ సరసన అనన్య పాండే కలిసి నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.