వేసవిలో విజయ్ సినిమా

ప్రస్తుతం ‘ఫైటర్‌’ చిత్రం చేస్తున్నారు విజయ్‌ దేవరకొండ. వచ్చే ఏడాది వేసవి నుంచి మరో సినిమాను షురూ చేయాలనుకుంటున్నారని తెలిసింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ చేస్తున్న సినిమా మార్షల్‌ ఆర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది.

కోవిడ్‌ వల్ల ఈ చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. అలానే ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ‘దిల్‌’ రాజు ఈ సినిమాను నిర్మిస్తారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.