వేదం నాగ‌య్య కన్నుమూత

వేదం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగ‌య్య శ‌నివారం క‌న్నుమూశారు. 30కి పైగా సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు ఊర్లో రెండెక‌రాల భూమి ఉండేది. అక్క‌డ ప‌ని లేక‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు.

ఇచ్చిన డైలాగ్‌ని కంఠ‌స్తం ప‌ట్టి గ‌డ‌గ‌డ చెప్ప‌డంతో అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించి వేదం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఇక అప్ప‌టి నుండి అత‌నికి వేదం నాగ‌య్యగా పేరు వ‌చ్చింది. నాగ‌వ‌ల్లి, ఒక్క‌డినే, స్టూడెంట్ సార్, ఏ మాయ చేశావే, రామయ్య వ‌స్తావ‌య్యా, స్పైడ‌ర్, విరంజి ఇలా ప‌లు సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య తొలుత మూడు వేల పారితోషికం అందుకున్నారు. ఇటీవ‌ల ఆయన భార్య అనారోగ్యంతో క‌న్నుమూశారు. సినిమా ఆఫ‌ర్స్ లేక పూట గ‌డ‌వడం క‌ష్టంగా మారిన నాగ‌య్య‌కు కేసీర్, మా అసోసియేష‌న్ అండ‌గా నిలిచింది. కొన్నాళ్లుగా నాగ‌య్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఈ రోజు తుదిశ్వాప విడిచారు. ఆయ‌న మృతికి ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.