వ‌రుడు కావ‌లెను

సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో కూడిన కథాంశాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటాడు యువ న‌టుడు నాగ‌శౌర్య‌. ఈ యువ హీరో న‌టిస్తోన్న తాజా చిత్రం వ‌రుడు కావ‌లెను. పెళ్లి చూపులు ఫేం రీతూవ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. చిత్ర‌యూనిట్ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ వ‌రుడు కావ‌లెను ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. సీనియ‌ర్ న‌టీన‌టులు ముర‌ళీశ‌ర్మ‌, న‌దియా, నాగశౌర్య‌, రీతూవ‌ర్మ ఒకే ఫ్రేమ్ లో ఉన్న స్టిల్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ సౌజ‌న్య (డెబ్యూట్‌) డైరెక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ చంద్ర‌శేఖ‌ర్. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.