వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’  ఆల్‌టైమ్ రికార్డ్స్

‘ఉప్పెన’ సినిమా మండే ఎండల్లో కూడా మంచి వసూళ్లను తీసుకొస్తుంది. విడుదలైన 25 రోజుల తర్వాత కూడా ఈ సినిమాకు కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. విడుదలైన కొత్త సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడంతో మరో ఆప్షన్ లేక ప్రేక్షకులు కూడా ఉప్పెన వైపు కదులుతున్నారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు 25 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ పాతిక రోజుల్లో ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్ని చోట్లా అదిరిపోయే వసూళ్లు సాధించింది. మరి ఇప్పటి వరకు 25 రోజుల్లో వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ చూద్దాం..

నైజాం: 15.41 కోట్లు

సీడెడ్: 7.69 కోట్లు

ఉత్తరాంధ్ర: 8.48 కోట్లు

ఈస్ట్: 5.03 కోట్లు

వెస్ట్: 2.61 కోట్లు

గుంటూరు: 2.96 కోట్లు

కృష్ణా: 3.13 కోట్లు

నెల్లూరు: 1.75 కోట్లు

AP-TG 25 రోజుల మొత్తం: 47.24 కోట్లు షేర్ (75 కోట్లు గ్రాస్)

కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.35 కోట్లు

ఓవర్సీస్ – 1.38 కోట్లు

వరల్డ్ వైడ్ 25 రోజుల మొత్తం – 50.77 కోట్లు షేర్