‘ఆచార్య’ సెట్‌లో మెగా కోడలు

మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. స్టార్‌ హీరోలైన మామ, భర్త సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉంటే.. కోడలు సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా నిత్యం వార్తల్లో ఉంటారు. అయినప్పటికీ భర్త రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో సెట్స్‌లో కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తుంది. తాజా ఆమె ‘ఆచార్య’ సెట్‌లో కూడా సందడి చేసేందుకు పయనమైంది. ఇందుకోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదెరి కొద్ది సేపటి క్రితమే రాజమండ్రి ఎయిర్‌పోర్టులో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం చెర్రీ తండ్రి మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ఆచార్య షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కతున్నఈ మూవీలో చెర్రీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ మారెడుమిల్లిలోని అటవీ ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి, రామచరణ్‌లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు నిన్న చెర్రీ షేర్‌ చేసిన ఓ స్టిల్‌ చూస్తే తెలుస్తోంది. అంతేగాక రామ్‌ చరణ్‌ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మక తెరకెక్కి‍స్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతో చెర్రీ ఒకేసారి రెండు మూవీ షూటింగ్‌లలో పాల్గొంటు ఫుల్‌ బిజీ ఆయిపోయాడు.