ప్రముఖ టీవీ నటి కన్నుమూత

ఈ ఏడాది కరోనా కారణంగా ఎంతోమంది తారలను కోల్పోయింది సినీ లోకం. ఏడాది ఆరంభం నుంచే యావత్ దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేటికీ తన ప్రభావం చూపిస్తూనే ఉంది. తాజాగా కరోనా కారణంగా ప్రముఖ టీవీ నటి దివ్య భట్నాగర్ (34) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె శరీరంలో ఆక్సీజన్ స్థాయిలు పడిపోయి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

నవంబర్ 26వ తేదీ నుంచి దివ్య భట్నాగర్‌కు కరోనా చికిత్స అందిస్తున్నప్పటికీ, ఆమె శరీరం సహకరించకపోవడంతో మరణించారని సన్నిహితులు పేర్కొన్నారు. కొద్దిరోజుల పాటు ఆమెను వెంటిలేటర్‌పై కూడా ఉంచినా ఫలితం లేదని అన్నారు. దివ్య భట్నాగర్ మరణవార్త తెలిసి పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా తమ తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె మృతిపట్ల మృతిపట్ల నటులు దేవోలీనా భట్టాచార్జీ, శిల్పా శిరోద్కర్ విచారం వ్యక్తం చేశారు. ”యే రిష్టా క్యా కెహ్లతా హై, తేరా యార్ హూన్ మెయిన్” షోలలో నటించి పాపులర్ అయ్యారు దివ్య భట్నాగర్.