తాప్సీ కి ట్రాఫిక్ పోలీసుల షాక్

హీరోయిన్ తాప్సీ పన్నుకు ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు జరిమానా విధించారు. తాను బైక్ నడుపుతున్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తాప్సి ఫైన్ పడిన విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తాప్సీ ప్రస్తుతం ‘లక్ష్మీ రాకెట్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయి పరిసరాల్లో జరుగుతోంది.

ఓ సన్నివేశం చిత్రీకరణలో భాగంగా తాప్సీ హైవేపై బుల్లెట్‌ నడిపింది. అయితే ఆమె హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడపడం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ముంబయి పోలీసులు జరిమానా విధించారు. డెనిమ్ జీన్స్ విత్ జీన్స్ జాకెట్‌లో బుల్లెట్ న‌డుపుతున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తాప్సీ..హెల్మెట్ లేకుండా జ‌రిమానా ప‌డే కంటే ముందు.. అంటూ క్యాప్షన్ ఇచ్చిం