టాలీవుడ్ విలన్ కి కరోనా పాజిటివ్

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ న‌డుస్తుంది.  సినీ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌ర ప‌రుస్తుంది. కొద్ది రోజుల క్రితం ర‌ణ్‌బీర్ క‌పూర్, సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌మ‌కు క‌రోనా సోకింద‌ని ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇక శుక్ర‌వారం బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు మ‌నోజ్ బాజ్‌పాయ్‌కి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఇక తాజాగా తెలుగు, హిందీ సినిమాల‌లో విల‌న్ పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఆశిష్ విద్యార్ధి క‌రోనా బారిన ప‌డ్డ‌ట్టు వీడియో ద్వారా తెలియ‌జేశారు.నాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. నాతో కాంటాక్ట్ అయిన వాళ్లు కూడా ద‌య‌చేసి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డి. నాకు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. మీరు చూపిస్తున్న ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ ఆశిష్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ద్వారా తెలియ‌జేశాడు. ఢిల్లీలోని ప్ర‌ముఖ ఆసుప‌త్రిలో ఆశిష్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. ఆశిష్ విద్యార్ధి తెలుగులో పోకిరి, భాగ‌మ‌తి, జ‌న‌తా గ్యారేజ్‌, అతిథి, అన్న‌వ‌రం వంటి చిత్రాల‌లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లు పోషించిన విష‌యం తెలిసిందే