- ఆస్ట్రేలియా తపాలా స్టాంపుపై తెలుగు హీరో
హైదరాబాద్,తీస్మార్ న్యూస్:ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఈ పేరు వింటే అబిమానులు పులకరించిపోతారు.ఎన్నో చిత్రాల్లో నటించి,ఎన్నో అవార్డులు పొంది,అభిమానుల గుండెల్లో చిరస్థాయిలో చెరగని ముద్ర వేశారు.ఆస్ట్రేలియాలోని సూపర్ స్టార్ అభిమానుల చొరవతో అక్కడి ప్రభుత్వం కృష్ణకు అరుదైన గౌరవం ఇచ్చి,ఆయన పేరుపై ఒక స్టాంప్ విడుదల చేసింది.దీని విలువ 1.65డాలర్లు.ఇటీవల కృష్ణ అభిమానులు ఆయనకు స్టాంప్ ని అందజేశారు. ఆయన అభిమానులు ప్రపంచ నలుమూలలా వ్యాపించి ఉన్నారనడానికి ఈ ఒక్క సంఘటన చాలు.ఈ పరిణామం తెలుగు చిత్రసీమ గర్వించదగిన విషయం అని ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.ఇంతటి ఘనత సాధించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి తీస్మార్ న్యూస్ తరుపున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.