హిట్ గ్యారేజ్…

ఫ్లాపు హీరోలకు లిఫ్ట్ ఇవ్వబడును

భలేభలేమగాడివోయ్ సినిమా ముందు వరుస ఫ్లాపుల్లో వున్నాడు హీరో నాని. ఆ టైమ్ లో మారుతి డైరక్షన్ లో సినిమా చేసి, హిట్ కొట్టాడు. ఆ తరువాత అలా సాగిపోతున్నాడు. మహానుభావుడు సినిమా ముందు వెనుక శర్వానంద్ పరిస్థితి డిటో డిటో. ప్రతి రోజూ పండగ ముందు సాయితేజ్ కు కష్టకాలమే. కానీ చిత్రంగా మారుతి హిట్ లు ఇచ్చిన హీరోలు ఎవ్వరూ ఆయనకు అందుబాటులోకి రావడం లేదు. హాయ్ అంటున్నా, ఫ్రెండ్లీగా వుంటున్నా, సినిమా అనేసరికి మాత్రం స్మూత్ గా తప్పించుకుంటున్నారు.ప్రతి రోజూ పండగే తరువాత తన కథకు హీరో కోసం మారుతి గట్టిగానే ప్రయత్నించారు కానీ ఎవ్వరూ దొరకలేదు. రవితేజ దొరికాడు అనుకుంటే బేరం కుదరలేదు.దాంతో ఇప్పుడు గోపీచంద్ దగ్గర ఆగింది వ్యవహారం. సెంటిమెంట్ ప్రకారం గోపీచంద్ కు కూడా హిట్ ఇస్తాడేమో? అనుకోవడం వరకు బాగానే వుంది. కానీ నాని దగ్గర ప్రారంభమై గోపీచంద్ వరకు రావడం అన్న యాంగిల్ లో చూసుకుంటే మాత్రం వేరేగా వుంటుంది. వెనుక వచ్చిన వాళ్లు ఓ చిన్న సినిమా చేసి పెద్ద హీరోల దగ్గర చేరిపోతున్నారు. మారుతికి మాత్రం ఫ్లాపుల్లో వున్నవారిని ఎత్తడంతో సరిపోతోంది.