టాలీవుడ్ యాక్టర్ రానా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు అరణ్య. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. హిందీలో ‘హాథీ మేరా సాథీ’, తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదలవుతోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సినిమా విడుదలపై స్పష్టత వచ్చింది. మార్చి 26న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సరికొత్త సాధారణ వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అరణ్యను మార్చి 26న మీ ముందుకు తెస్తున్నాం. సినిమా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్న వారికి, నాకు , మా టీంకు సపోర్టుగా నిలిచి ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నానని రానా ట్వీట్ చేశాడు.ఈ చిత్రంలో రానా అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇతర పాత్రల్లో జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ నటించారు.. మానవుల స్వార్థం కోసం అడవుల ఆక్రమణ, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వల్ల ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
