ఈ ఏడాది ఇండస్ట్రీలో రీమేక్ లదే హవా

తెలుగులో ఎన్ని కొత్త కథలు వచ్చినా కూడా కొందరు హీరోలు మాత్రం ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకుంటున్నారు. అందులోనూ మన పక్క ఇండస్ట్రీలో వచ్చిన కథలనే తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రెడ్ తమిళ తడమ్ సినిమాకు రీమేక్. ఇప్పుడు మరో అరడజన్ సినిమాలు కూడా ఈ ఏడాది తెలుగులో రీమేక్ కానున్నాయి. మరి అవేంటి.. ఎప్పుడు వస్తున్నాయి.. అందులో హీరోలెవరో చూద్దాం..

వకీల్ సాబ్

పింక్ సినిమాకు రీమేక్‌గా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడు.

లూసీఫర్

మలయాళం బ్లాక్‌బస్టర్ లూసీఫర్ తెలుగు రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. మోహన్ రాజా దీనికి దర్శకుడు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.

అయ్యప్పునుమ్ కోషియుమ్

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సెప్టెంబర్ 9న విడుదల కానుంది ఈ చిత్రం.

వేదాళం

అజిత్ హీరోగా వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయబోతున్నాడు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు.

నారప్ప

వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ధనుష్ బ్లాక్ బస్టర్ అసురన్ కు రీమేక్. మే 14న ఈ చిత్రం విడుదల కానుంది.

దృశ్యం 2

మలయాళంలో ఈ మధ్యే విడుదలైన సంచలన విజయం అందుకున్న సినిమా దృశ్యం 2. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగులోనూ దర్శకుడు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

అంధాధూన్

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ అంధాధూన్ ను తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రీమేక్ చేస్తున్నాడు. ఇందులో తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది.