‘మహా సముద్రం’లో శర్వానంద్,సిద్ధార్థ్ ల ప్రయాణం ఎప్పటి నుంచంటే….

శర్వానంద్‌, సిద్ధార్థ్‌ లీడ్‌రోల్‌లో నటిస్తున్న చిత్రం మహా సముద్రం. ఆర్ఎక్స్ 100 చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ సక్సెన్‌ను అందుకున్న డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్‌ ల‌వ్ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్‌ క్రేజీ అప్‌డేట్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కించారు. చాలా రోజుల విరామం త‌ర్వాత సిద్ధార్థ్‌ మళ్లీ ఈ చిత్రం ద్వారా ప్రేక్షుకుల ముందుకు వస్తున్నాడు.