మాయదారి మైసమ్మ, కోడిపాయె లచ్చమ్మ వంటి ఫోక్ సాంగ్స్‌తో యూత్‌ని ఉర్రూతలూగించిన ప్రముఖ గేయ రచయిత, గాయకుడు లింగరాజ్( 66) బుధవారం ఉదయం కన్నుమూశారు. పాటల రచనతో పాటు గాత్రంతో ఎంతో మంది శ్రోతల హృదయాలని ఆయన గెలుచుకున్నారు. వెయ్యికి పైగా పాటలు పాటలు రాసి పాడిన లింగరాజ్ 1987లో పాడిన మాయదారి మైసమ్మ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. బొల్లారం ఆదర్శనగర్‌లో ఉండే లింగరాజ్.. స్థానిక మిత్రులతో కలసి డిస్కో రికార్డింగ్ కంపెనీ (డీఆర్‌సీ) పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారితో కలిసి ఎన్నో జానపద గేయాలుపాడారు. అయ్యప్ప భజన పాటలు కూడా ఆయన గొంతు నుండి జాలువారాయి. ఆయనకు భార్య , ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నిన్న సాయంత్రం అతని అంత్రక్రియలు ముగిశాయి. లింగరాజ్ లేరనే వార్త ఆయన అభిమానులని శోక సంద్రంలోకి నెట్టింది.