ప్రముఖ విలన్ నర్సింగ్ యాదవ్ మృతి

2020 వెళుతూ వెళుతూ తెలుగు చిత్ర సీమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 57 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగ్ యాదవ్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రల్లో మెప్పించిన నర్సింగ్ యాదవ్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.