మంచి జోరు మీదున్న తాప్సీ

హీరోయిన్‌ తాప్సీ మంచి జోరు మీదున్నారు. హిందీలో, తమిళంలో వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. ఆకాష్‌ ఖురానా దర్శకత్వంలో ‘రష్మీ రాకెట్‌’ చిత్రాన్ని ఇటీవల పూర్తి చేసిన తాప్సీ తన తర్వాతి చిత్రం ‘లూప్‌ లపేటా’ చిత్రీకరణలో జాయిన్‌ అయ్యారు. ఈ చిత్రానికి ఆకాష్‌ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న తాప్సీ సోషల్‌ మీడియా వేదికగా తన ఫస్ట్‌ లుక్‌ని అభిమానులతో పంచుకున్నారు.

‘హాయ్‌… నేను సవి! కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. నేను ఈ స్థితికి ఎందుకు వచ్చాను అని! నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నా జీవితం ఇంత గందరగోళంలో ఎందుకు పడిందని!’’ అని సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో టూకీగా చెప్పారు తాప్సీ. డార్క్‌ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. జర్మన్‌ చిత్రం ‘రన్‌ లోలా రన్‌’కి ఇది హిందీ రీమేక్‌.