ఆస్కార్ బరిలో సూర్య “సూరారై పోట్రు”

హైదరాబాద్‌:  సూర్య న‌టించిన త‌మిళ చిత్రం సూరారై పొట్రు.. ఈ ఏడాది ఆస్కార్‌కు పోటీప‌డ‌నున్న‌ది.  సుధా కొంగ‌ర డైర‌క్ట్ చేసిన ఈ మూవీ ఆస్కార్ రేసులో ఉన్న‌ది.  జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో ఈ సినిమా ఆస్కార్‌కు పోటీప‌డుతున్న‌ది. బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ డైర‌క్ట‌ర్ తో పాటు మ‌రికొన్ని కేట‌గిరీల్లో ఈ సినిమా పోటీప‌డ‌నున్న‌ది. తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా అన్న టైటిల్‌తో ఈ సినిమా రిలీజైన విష‌యం తెలిసిందే.  ఎయిర్ డెక్క‌న్ సంస్థ‌ను స్థాపించిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత‌క‌థ ఆధారంగా సినిమాను రూపొందించారు. సూర్య కీల‌క పాత్ర పోషించారు.  అప‌ర్ణా బాల‌ముర‌ళి, ప‌రేశ్ రావ‌ల్ దీంట్లో న‌టించారు.  సూరారై పొట్రు సినిమా ఆస్కార్ రేసుకు ఎంట్రీ అయిన‌ట్లు ప్రొడ్యూస‌ర్ రాజశేఖ‌ర్ పాండియ‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. బెస్ట్ యాక్ట‌ర్‌, బెస్ట్ యాక్ట్రెస్‌, బెస్ట్ డైర‌క్ట‌ర్‌, బెస్ట్ ఒరిజిన‌ల్ మ్యూజిక్ కోసం.. ఆస్కార్స్‌లో జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో పోటీప‌డ‌నున్న‌ట్లు పాండియ‌న్ తెలిపారు.  అకాడ‌మీలో త‌మ సినిమా స్క్రీనింగ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ద‌క్కింద‌న్నాడు. గ‌త ఏడాది లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమా హాళ్లు బంద్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఓటీటీ ఫార్మాట్‌లో సురారై పొట్రును రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఆకాశం నీ హ‌ద్దురా సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్స్ వేడుక జ‌ర‌గ‌నున్న‌ది.