సూపర్ స్టార్ కి తీవ్ర అస్వస్థత

తమిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యానికి గుర‌య్యారు. రక్త పోటులో హెచ్చు త‌గ్గుల‌ వ‌ల‌న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అయితే ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన‌ట్టు తెలిపారు. ఈ నెల 22న నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌లోను ర‌జ‌నీకాంత్‌కు క‌రోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని ఆపోలో ఆసుప‌త్రి వైద్యులు పేర్కొన్నారు. బీపీ అదుపులో లేక‌పోవ‌డంతో ఆసుప‌త్రిలో చేరిన ర‌జనీకాంత్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. బీపీ కంట్రోల్ కాగానే డిశ్చార్జ్ చేస్తాం అని వైద్యులు ప్రెస్ నోట్‌లో తెలిపారు.అన్నాత్తె షూటింగ్ కోసం కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లోనే ఉంటున్నారు ర‌జ‌నీకాంత్. ఇటీవ‌ల అన్నాత్తె చిత్ర బృందంలో 8 మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో షూటింగ్ ఆపేసారు. ర‌జ‌నీకాంత్‌కి నిర్వ‌హించిన ప‌రీక్షలో నెగెటివ్ అని తేలిన ఆయ‌న స్వీయ ‌నిర్భందంలోకి వెళ్ళారు. డిసెంబ‌ర్ 31న ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ గుర్తు, జెండా, అజెండా ప్ర‌క‌టించ‌నున్న త‌రుణంలో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డం అంద‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తుంది.