78వ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న’ అంటూ బర్త్‌డే విషెస్‌ను తెలిపారు.

ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్‌ చేశారు.కృష్ణ బర్త్‌డే సందర్భంగా కూతురు మంజుల ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘హ్యాపీ బర్త్‌డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్‌ మోడల్‌. లవ్‌ యూ సో మచ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.