లైవ్ లో పాటలు పాడిన సునీత

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌కి వెళ్లలేకపోతున్నానని చెప్పారు సింగర్‌ సునీత. వ్యక్తిగత, కుటుంబ రక్షణలో భాగంగా తాను ఇంటికే పరిమతం అయ్యానని చెప్పారు. అయితే, కరోనా నేపథ్యంలో అందరికీ కొంచెం రిలీఫ్ కలిగించేందుకు లైవ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వస్తున్నానని తెలిపారు. అత్యవసరమైన పనులు లేకపోతే ఇంటిపట్టునే ఉండాలని అభిమానులను కోరారు.

ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు పాటలను ఆలపించారు సింగర్‌ సునీత. నాగార్జున మూవీ ‘నేనున్నాను’ నుంచి ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని..’ పాట పాడి, దానిని వైద్యులు, ఇతర ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి అంకితం ఇచ్చారు. ఇకపై ప్రతిరోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి 30 నిమిషాలపాటు ఇన్‌స్టా లైవ్‌లోకి వస్తానని.. నెటిజన్లు కోరిన పాటల్ని పాడి వినిపిస్తానని ఆమె తెలిపారు.