సునీత పెళ్ళి…రోజా కౌంటర్

తెలుగు ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత రెండో పెళ్లి ఈ మధ్యే ఘనంగా జరిగింది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త, మ్యాంగో రామ్‌ను పెళ్లి చేసుకుంది. ఈయన డిజిటల్ మీడియాలో తోపు. మ్యాంగో అధినేత రామ్ వీరపనేనికి ఆస్తులు బాగానే ఉన్నాయి. రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. అయితే సునీత పెళ్లిపై సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయాలను వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే, మరికొందరు రెండో పెళ్లి చేసుకున్న సునీతను విమర్శిస్తున్నారు. సునీత పెళ్లి ఫోటోలపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా అలాంటి వారికి రోజా కౌంటర్ ఇచ్చారు.ఐతే, సునీత/రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకోవడంపై కొంత మంది సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎదిగిన కొడుకు, కూతురు ఉండి ఈ వయసులో సునీతకు రెండో పెళ్లి అవసరమా అంటూ కామెంట్స్ చేసారు. ఎంతో సంతోషంతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన సునీత్ పై కొంత మంది నెటిజన్స్ పనికట్టుకొని చేస్తోన్న ఈ దుష్ప్రచారంపై రోజా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.సునీత తన కెరీర్‌లో ఎన్ని ఒడిదుడుకులకు లోనై ఈ స్టేజ్ కు వచ్చింది. అలాంటి ఆమె ఇపుడు తన పిల్లలు, పెద్దల అనుమతితో రెండో పెళ్లి చేసుకుంది. ఈమె తన మానానా తాను రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవితం గడపలాని ఫిక్స్ అయింది. ఇలాంటి టైమ్‌లో కొంత మంది పనిలేని ఎదవలు ఈమెకు రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు వాళ్లు మనుషులేనా అంటూ మండిపడింది. వాళ్ల కుటుంబంలో కూడా సునీత లాంటి వ్యక్తి ఉండి ఉంటే ఇలాంటి కామెంట్స్ చేసేవాళ్లా అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. మొదటి పెళ్లి తర్వాత పిల్లలతో సంసార బాధ్యతలను నిర్వహించిన సునీత ఇపుడు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ల అనుమతితోనే రెండో పెళ్లి చేసుకుంది. ఏమైనా సునీత రెండో పెళ్లి అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారం. ఇక నుంచైనా సునీత పెళ్లిపై కామెంట్స్ చేసేవాళ్లు ఆమె కంటూ పర్సనల్ లైఫ్ ఉంటుదంన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.