కార్తీ సుల్తాన్ టీజర్ బీభత్సం..రిలీజ్ ఎప్పుడంటే…

కార్తీ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా టీజర్ వచ్చేసింది. ఈ టీజర్ ను కార్తీ రిలీజ్ చేశారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్  డైరెక్టర్. ఈ సినిమా టీజర్‌ను కార్తీ తన ట్విటర్ లో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్‌లో ఉంటుందని కార్తీ ప్రకటించారు. అలాగే, ఫుల్ వినోదం, రొమాన్స్ తో పాటు ఫుల్ యాక్షన్ కూడా ఉంటుందని కార్తీ అనౌన్స్ చేశారు. ఈ సినిమా టీజర్ చూస్తుంటే కూడా సినిమా కార్తీకి తగినట్టే ఉంటుందనిపిస్తోంది.  ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా కార్తీ ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తన మొదటి సినిమా నుంచి డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా వచ్చిన ఖైదీ, దొంగ సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా ఖైదీ సినిమాకు జనం ఫిదా అయిపోయారు. అంతకు ముందు వచ్చిన ఖాకీ సినిమా కూడా ప్రేక్షకులక విపరీతంగా నచ్చింది. ఇప్పుడు వస్తున్న సుల్తాన్ సినిమా మీద కూడా అంచనాలు బాగా ఉన్నాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్న నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. సినిమాలో రొమాన్స్ కూడా చాలా బాగుంటుందని కార్తీ ప్రకటించారు. రష్మిక కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే తెలుగులో మంచి హిట్లు కొట్టిన ఈ కన్నడ భామ తమిళంలో కూడా మంచి హిట్ కొట్టాని చూస్తోంది.

మహాభారతంలో కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని, అదే కృష్ణుడు పాండవుల వైపు ఉంటే ఎలా ఉంటుంది? మహాభారతం యుద్ధం లేకుండా ఊహించుకుంటే ఎలా ఉంటుందో చూడాలంటూ కార్తీ చెప్పిన డైలాగ్ సినిమా మీద ఆసక్తిని పెంచుతోంది. అంటే హీరో జనం వైపు ఉంటాడా? విలన్ల వైపు ఉంటాడా? అసలు కృష్ణుడు కౌరవుల వైపు ఉండడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దీన్ని డైరెక్టర్ బక్కియరాజ్ కన్నన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.