మెగా అభిమానులు ఎప్పుడెపుడా అని ఎదురుచూస్తున్న ఆచార్య టీజర్ త్వరలోనే సందడి చేయనుంది. ఇప్పటికే టీజర్ అప్‌డేట్ గురించి చిరంజీవి-కొరటాల శివ మీమ్స్ నెట్టింట్లో వైరల్ కూడా అయ్యాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ మరో మీమ్స్ పోస్టర్ ను ట్విటర్ లో షేర్ చేస్తూ..ఆచార్య అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మూవీకి స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు మీమ్స్ ద్వారా తెలిపాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. రాంచరణ్.మణిశర్మ కంపోజ్ చేసిన బీజీఎం-రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగనున్నట్టు వరుణ్‌తేజ్ పోస్టర్ ద్వారా తెలిసిపోతుంది. ఒకేసారి టీజర్ అప్‌డేట్‌తోపాటు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ కూడా ఉంటుందని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మెగా అభిమానులు. సీరియస్ ఎమోషనల్, మాస్ ఎలిమెంట్స్ కలబోతగా టీజర్ ఉండనున్నట్టు టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్‌చరణ్ కీ రోల్ పోషిస్తుండగా..పూజాహెగ్డే అతనికి జోడీగా కనిపించనున్నట్టు ఇన్‌సైడ్ టాక్.