దక్షిణాదిలో రికార్డు సృష్టించిన పాట

ధనుష్, సాయిపల్లవి జంటగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మారి 2’. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. 2018లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. ఈ సినిమాలోని రౌడీ బేబి పాట ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. లక్షల నుంచి కోట్లలో వ్యూస్‌ సాధిస్తూ దూసుకెళుతోంది.

దక్షిణాదిలో అత్యధికంగా ఒక బిలియన్‌ (వంద కోట్లు) వ్యూస్‌ సాధించిన పాటగా రౌడీ బేబి రికార్డు సృష్టించింది. ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు ధనుష్‌. ‘నా సినిమా కెరీర్‌లో అనుకోకుండా ఓ మధురమైన సంఘటన చోటుచేసుకుంది. ‘కొలవెరి డీ..’ పాట విడుదలై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయిన రోజునే ‘రౌడీ బేబి’ పాట బిలియన్‌ వ్యూస్‌ సాధించడం సంతోషంగా ఉంది. పైగా దక్షిణాదిలో బిలియన్‌ వ్యూస్‌ సాధించిన పాటగా నిలవడం మాకు గర్వంగా ఉంది’’ అన్నారు.