కమల్‌ హాసన్‌ ఓటమి...శృతి ఎమోషనల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్‌ నీది మయ్యమ్‌ అధ్యక్షుడు, ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఆయనకు ఓటమి తప్పలేదు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కమల్‌..సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్‌(బీజేపీ)పై 1,300 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడిపోయారు. కమల్‌మాసన్‌ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి మూడో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కమల్‌ హాసన్‌ ప్రకటించుకున్నారు. అయితే చివరకు ఆయనే ఓడిపోవడం ఆయన అభిమానులకు షాకింగ్‌కు గురి చేసింది. అంతేకాకుండా ఆయనతో పాటు ఆయన పార్టీకి చెందిన వారు 142 స్థానాల్లో పోటీ చేయగా వారందరూ పరాజయం పొందారు.

కమల్ తొలి ఎన్నికలోనే ఓటమిపాలవడంపై ఆయన అభిమానులు ఆవేదన ​ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కమల్‌ కూతురు, హీరోయిన్‌ శృతిహాసన్ స్పందించారు.‘మిమ్మల్ని చూస్తుంటే ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది నాన్న (అప్పా)’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో తన తండ్రి ఫొటోను షేర్‌ చేసింది. అంతేకాకుండా తన తండ్రిని పైటర్‌ అంటూ అభివర్ణిస్తూ ద ఫైటర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను పోస్ట్‌ చేశారు. తండ్రిపై శృతిహాసన్‌ చేసిన ఈ కామెంట్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి. ‘గెలుపోటములు సహాజం..ప్రతి కూతురికి తన తండ్రి ఎప్పటికీ హీరోనే’ అంటూ పలువురు నెటిజన్లు పేర్కొన్నారు.