నాకు కన్నడ పరిశ్రమ అంటే గౌరవం

‘కేజీఎఫ్’‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తో‍న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం కన్నడ చిత్రాలపై ఆమె చేసిన ట్వీట్‌ తాజాగా మరోసారి వైరల్‌ అవుతోంది. ఇప్పట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో తాను అనుగుపెట్టనని, ప్రస్తుతం కన్నడ సినిమాల్లో నటించే అవకావం లేదంటూ 2017లో ట్వీట్‌ చేసి శృతి విమర్శల పాలైన సంగతి తెలిసిందే.

దీంతో ఆమెకు కన్నడ పరిశ్రమపై గౌరవం లేదని, అందుకే అవకాశాలను వదులుకుంటోందంటూ కన్నడ ప్రేక్షకులంతా శృతిపై విరుచుకుపడ్డారు. ఇక తాజాగా కన్నడ దర్శకుడైన ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ‘సలార్‌’ చిత్రంలో ఆమె నటించేందుకు రేడి అవ్వడంతో మరోసారి నెటిజన్లు శృతిపై వరుస కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు కన్నడ చిత్రాల్లో నటించనంటూ పరిశ్రమను అగౌరపరిచి.. ఇప్పుడు కన్నడ దర్శకుడి చిత్రంలో నటించేందుకు సిద్దమైందంటూ నెటిజన్‌లు విమర్శలు గుప్పిస్తున్నారు.

దీంతో తనపై వస్తున్న విమర్శ వ్యాఖ్యలపై తాజాగా శృతిహాసన్‌ స్పందించారు. ‘నాలుగేళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు కన్నడ పరిశ్రమ అంటే గౌరవం ఉంది. కన్నడ సినీ పరిశ్రమలో భాగం కావడం పట్ల నాకేంతో సంతోషంగా ఉంది. అయితే గతంలో నేను ఓ కన్నడ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సమయంలోనే వేరే సినిమాల్లో నటిస్తున్నాను. క్షణం తీరిక లేక ఫుల్‌ బిజీ అయిపోయాను.

దీంతో డెట్స్‌ సర్దుబాటు కాకపోవడంలో ఆ మూవీ ఆఫర్‌ను వదులుకున్న. అది చెప్పెందుకే అప్పుడు ఆ ట్వీట్‌ చేశాను. అంతే తప్పా కన్నడలో నటించడం ఇష్టం లేక కాదు’ అంటూ స్పష్టం చేశారు. అలాగే ‘సలార్’ సినీ బృందం చాలా ప్రత్యేకమైందని, ఈ  కథ, పాత్ర త‌నకెంతో నచ్చాయ‌న్నారు. ఈ మూవీ‌ యూనిట్ కూడా బాగా నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పానన్నారు. ఇక ప్రతి సినీ ప‌రిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు, నటీనటుల పట్ల తనకు చాలా గౌరవం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.