లేటు వయసు నటి…లేత వయసు డేటింగ్?

ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు…పడుచు పిల్లల నుండి పండు ముసలి వరకు ప్రేమలకు అనుబంధాలను కోరుకోవడం తప్పూ కాదు.

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ సీనియర్ నటి ఒకరు ఇలాగే కోరుకుంటున్నారని, ఓ ప్రముఖ వ్యాపారితో సన్నిహిత స్నేహ బంధంలో ఉన్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

యాభైలు దాటేసిన ఆ సీనియర్ నటి ప్రస్తుతం పెద్దగా నటించడం లేదు. ఒంటరిగా వుంటున్న ఆమె ఓ నార్త్ ఇండియన్ వ్యాపారితో సన్నిహితంగా వుంటున్నట్లు తెలుస్తోంది.

ఒక దశలో పెళ్లి ఆలోచన కూడా చేసారని, అయితే ఈ వయసులో అలాంటి నిర్ణయం తీసుకోవడం అంత బాగుండదనే ఉద్దశంతో ఆ బంధం అలా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల టాలీవుడ్ లో లేటు వయసు పెళ్లిళ్లు జరుగుతుండడంతో ఈ నటి కూడా పెళ్లి చేసుకుంటారేమో అన్న గ్యాసిప్ లు, ఈ వయసులో బాగుండదనే కామెంట్లు రెండూ వినిపిస్తున్నాయి.