అది మన వృత్తికి ప్రమాదం

కష్టపడి పని చేయాలి కానీ పనిలో సౌకర్యం కోరుకుంటే అది మన వృత్తికి ప్రమాదం అవుతుందంటారు. సమంత కూడా ఈ మాటే అంటున్నారు. కథానాయికగా పదకొండేళ్లు పూర్తి చేసుకున్నారామె. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ – ‘‘హార్డ్‌వర్క్‌కి ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. పనిలో సౌకర్యాన్ని వెతుక్కోకూడదు. అందుకే పదకొండేళ్లుగా నేను షూటింగ్‌కి వెళ్లే ప్రతిరోజునీ నా మొదటి రోజు అనుకునే వెళతాను. అదే తపన, నేర్చుకోవాలనే పట్టుదల, అదే ఎనర్జీతో పని చేస్తాను. ఈ తపన, పట్టుదల, ఎనర్జీయే నటిగా నా ఎదుగుదలకు దోహదపడ్డాయి. వీటివల్లే ఇన్నేళ్లుగా సినిమాల్లో ఉండగలుగుతున్నాను’’ అన్నారు.