మీ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాను

టాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ సమంత అక్కినేని-నాగచైతన్యలు ప్రస్తుతం మాల్దీవులో ఎంజాయ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 23 నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట ఆదివారం అక్కడ వాలిపోయారు. అప్పటి నుంచి ఐలాండ్‌ అందాలను ఆస్వాధిస్తున్న వారి ఫొటోలను సమంత ఎప్పటికప్పుడు సోషల్లో మీడియాలో పోస్టు చేస్తూనే ఉన్నారు. తాజాగా సమంత బబుల్‌ బాత్‌‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసి తన డిజైనర్‌ ఫ్రెండ్‌ క్రెషాకు షాక్‌ ఇచ్చారు. అయితే ఈ బబుల్‌ బాత్‌టబ్‌ను‌ క్రెషా తన భర్త వన్రాజ్‌ జావేరిలు చై-సామ్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట.

కానీ సామ్, చైకి హ్యాండ్‌ ఇచ్చి తను మాత్రమే బబుల్‌ బాత్‌ను ఎంజాయ్‌ చేశారు. బాత్‌టబ్‌లో కుర్చుని ఉన్న సెల్ఫీ ఫొటోను సామ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేసి తన స్నేహితురాలు క్రెషాను ట్యాగ్‌ చేశారు. చై-సామ్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు‌ చేసిన బాత్‌టబ్‌లో సమంతను‌ మాత్రమే చూసి ఆమె షాకయ్యారంట. కాగా ఈ బాత్‌టబ్‌ను గులాబీ రేకులతో గుండె ఆకారంలో ప్రత్యేకంగా అలంకరించారంట. కానీ సామ్‌ మాత్రమే బబుల్‌ బాత్‌ను ఎంజాయ్‌ చేసి వారికి షాక్‌ ఇచ్చారు. అయితే సమంత, చై బర్త్‌డే రోజున స్విమ్మింగ్‌ పూల్ వద్ద ఉన్న చైతన్య ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే చై.. ఎప్పుడూ మీ స్వంత నిబంధనలతో జీవించండి.. ఎప్పటికీ నేను మీ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాను’ అంటూ సామ్‌ తన భర్త నాగచైతన్యకు ప్రత్యేకంగా పుట్తిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.