ప్రభాస్ ప్యాన్స్ కి “సలార్”పండుగ

బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు ప్రభాస్. కేజీఎఫ్ తో పాన్-ఇండియా దర్శకుడిగా మారాడు ప్రశాంత్ నీల్. అలాంటి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. అలా కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన ఈ కాంబినేషన్ ఎట్టకేలకు సెట్స్ పైకి రాబోతోంది. మరికొద్దిసేపట్లో సలార్ మూవీని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రభాస్ హీరోగా సలార్ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది. దర్శకుడు రాజమౌళి, కేజీఎఫ్ స్టార్ యష్ ఈ లాంఛింగ్ కు ప్రత్యేక అతిథులుగా హాజరుకాబోతున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది సినీ-రాజకీయ ప్రముఖులు కూడా వస్తున్నారు.రీసెంట్ గా రాధేశ్యామ్ సినిమాను పూర్తిచేసిన ప్రభాస్, మరికొన్ని రోజుల్లో సలార్ మూవీనే సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు. అయితే పూర్తిగా ఇదే సినిమాపై వర్క్ చేయడు. ఓవైపు ఆదిపురుష్ సినిమా చేస్తూనే, మరోవైపు సలార్ సినిమాకు కాల్షీట్లు సర్దుబాటు చేశాడు.కేజీఎఫ్ ఛాప్టర్-2 థియేటర్లలోకి వచ్చిన తర్వాత సలార్ షూటింగ్ ఊపందుకుంటుంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఆమె ఎవరనే విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఫిబ్రవరి నుంచి ఈ 2 సినిమాలతో బిజీ కాబోతున్నాడు ప్రభాస్.