కోలీవుడ్ లో సూర్య, ధనుష్ వంటి టాప్ హీరోలతో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సాయిపల్లవి. ఈ బ్యూటీ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించి మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది.. అయితే తెలుగులో ఈ భామ నాని మినహా స్టార్ హీరోల పక్కన కనిపించలేదు. ఇపుడు టాలీవుడ్‌లో టాప్ హీరోకు జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. అయ్యప్పనుమ్ కొషియుమ్ తెలుగు రీమేక్‌లో సాయిపల్లవి నటించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.తాజా టాక్ ప్రకారం సాయిపల్లవి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ భార్య పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో సాయిపల్లవి షూటింగ్ లో పాల్గొనున్నట్టు సమాచారం. ఈ మూవీలో సాయిపల్లవి పోషిస్తోంది చిన్న పాత్రే అయినా..రెమ్మునరేషన్ మాత్రం ఫుల్‌గానే తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో జోరుగా చర్చ నడుస్తోంది. మొత్తానికి సాయిపల్లవి టాలీవుడ్ లో కూడా ఏ లిస్ట్‌లో ఉన్న హీరోతో నటించే అవకాశం కొట్టేసింది. రాబోయే కాలంలో మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా కనిపించే అవకాశం లేకపోలేదు.
