14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్

నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరి’. ఈ మూవీ విడుదలకు ముందే మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ విడుదలైన ‘సారంగ దరియా’  అనే పాట యూట్యూబ్‌ సెన్సెషనల్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట కొత్త రికార్డును సొంతంగా చేసుకుంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్‌లో 50 మిలియన్‌ వ్యూస్ రాబట్టుకుని తొలి తెలుగు పాటగా నిలిచింది.

సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను చేరుకుంది. ఇక ఇటీవల యూట్యూబ్‌లో వరుసగా రికార్డుల కొల్లగొడుతున్న ‘అలా వైకుంఠపురంలో’ మూవీలోని సూపర్‌ హిట్‌ ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ‘సారంగ దరియా’ తరవాత ఉన్నాయి. ‘బుట్ట బొమ్మ’ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, ‘రాములో రాములా’ పాటకు 27 రోజులు పట్టింది. అయితే గతంలో ధనుష్‌తో కలిసి సాయి పల్లవి చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ మాత్రం 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్‌కు రీచ్ అయి ‘సారంగ దరియా’ కంటే ముందుంది.

సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన ‘సారంగ దరియా’ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు పవన్ సీహెచ్ సంగీతం అందించడంతో సారంగ దరియా అద్భుతమైన తెలంగాణ జానపదం గీతంగా కుదిరింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావులు నిర్మాలుగా వ్యవహిరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏప్రీల్‌ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.