నా ఆరోగ్యంపై వస్తున్న రూమర్‌లు

బాలీవుడ్‌ ‘జగ్‌ జగ్‌ జీయో’ మూవీ టీంకు కరోనా సెగ అంటుకున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్‌ ధావన్‌, నటీ నీతూ కపూర్‌, దర్శకుడు రాజ్‌ మెహితాలకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే ఇందులో నటిస్తున్న మరో నటుడు, సినీయర్‌ హీరో అనిల్‌ కపూర్‌కు మాత్రం కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ ఆయనకు కరోనా సోకిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై ఆయన స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ఇన్‌స్టాగగ్రామ్‌ స్టోరీని షేర్‌ చేశారు. ‘నా ఆరోగ్యంపై వస్తున్న రూమర్‌లకు పుల్‌స్టాప్‌ పెట్టాలనుకంటున్న.

ఇటీవల చేయించుకున్న కోవిడ్‌ పరీక్షల్లో నాకు నెగిటివ్‌ వచ్చింది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ.. త్వరగా కోలుకోవాలని నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా వరుణ్‌ ధావన్,‌ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ‘జగ్‌ జగ్‌ జీయో’లో నీతూ కపూర్‌, హీరో అనిల్‌ కపూర్‌లు‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత నెలలో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా షూటింగ్‌ నేపథ్యంలో ఇటీవల ఛండిఘర్‌ వెళ్లింది. ఈ క్రమంలో ఈ సినిమా హీరో వరుణ్‌, నటి నీతూ కపూర్‌, దర్శకుడు రాజ్‌ మెహతాలు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పటి వరకు దీనిపై వీరెవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం.