రామ‌రాజు న‌యా అవ‌తార్‌

టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా క‌థాంశంతో వ‌స్తున్న ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్‌, రాంచ‌ర‌ణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. కొమ్రం భీం పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ కనిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే విడుద‌ల ఫ‌స్ట్ లుక్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మ‌రో అప్‌డేట్ వ‌చ్చింది.

ఇవాళ సాయంత్రం 4 గంట‌ల‌కు రామరాజు కొత్త అవ‌తారాన్ని చూడ‌బోతున్నారంటూ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ న‌యా అవ‌తార్‌లో ఎలా క‌నిపిస్తాడో చూడాలి. ఆర్ఆర్ఆర్ లో అజ‌య్‌దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌, అలియ‌భాట్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 13న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది ఆర్ఆర్ఆర్.