మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు యువరాజా నిఖిల్ కుమార్ జాగ్వార్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో కొన్నాళ్ళ పాటు టాలీవుడ్‌వైపు చూడలేదు. ఇక ఇప్పుడు తన నాలుగో చిత్రంగా తెలుగులో రైడర్ అనే స్ట్రయిట్ చిత్రం చేస్తున్నారు నిఖిల్ కుమార్ . ఈ చిత్రానికి విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న రైడర్ సినిమాను లహరి ఫిలిమ్స్ బ్యానర్‌పై చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. ఈ రోజు నిఖిల్ కుమార్ బర్త్‌డే సందర్భంగా రైడర్ టీజర్ విడుదల చేశారు. ఇందులో చాలా యాక్షన్ మోడ్‌తో కనిపిస్తున్నారు. నిఖిల్ కుమార్ సరసన ఈ చిత్రంలో కశ్మీరా పరదేశి హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణమవుతోంది. అతి త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.