యువ నటుడు సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త ప్రాజెక్టు ‘రిపబ్లిక్’. దేవాకట్టా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు, శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయాన్ని కాపాడే కోర్టు..ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ప్రభుత్వం అవుతుంది. అదే అసలైన రిపబ్లిక్ అంటూ కోర్టు రూమ్‌లో సాయిధరమ్ వాయిస్ ఓవర్ తో ప్రజాస్వామ్యం గురించి చెప్తున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.